Karthika Deepam2 : వాళ్ళిద్దరి పెళ్లి చేసిన దీప.. షాక్ లో కార్తీక్!
on Sep 26, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -159 లో.... శ్రీధర్ ని దీప లోపలికి రాకుండా చేసి.. స్వప్న, శ్రీకాంత్ ల పెళ్లి ఆగిపోయేలా చేస్తుంది. పెళ్లి కొడుకు అమ్మాయి పోయే ఆస్తి పోయే అంటూ అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇక ఇంటికి వెళ్ళండి అని దీప అనగానే.. ఇప్పుడు మా డాడ్ ని ఎలా ఆపారో తెలియదు కానీ ఆపారు.. కానీ ఇప్పుడు కాకపోయినా మళ్ళీ నాకు పెళ్లి చేస్తాడని స్వప్న అనగానే.. ఇప్పుడు మా పెళ్లి చేస్తేనే దీనికి సొల్యూషన్ అని కాశీ అంటాడు. దాంతో దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత మాకు ఇప్పుడు పెళ్లి చెయ్యండి అంటూ దీపని ఇద్దరు రిక్వెస్ట్ చేస్తారు.
మరొకవైపు ఏంటి అండి.. ఫోన్ కట్ చేస్తున్నారని శ్రీధర్ దగ్గరికి కావేరి వెళ్లి అడుగుతుంది. అక్కడ మా చెల్లి సుమిత్ర ఉందని చూపిస్తాడు. మరి పెళ్లి అని కావేరి అనగానే.. ఇప్పుడు కాకపోతే తర్వాత చేసుకోవచ్చు కానీ ఇప్పుడు దొరికిపోతే ప్రాబ్లమ్ అవుతుందని శ్రీధర్ అంటాడు. మరొకవైపు కాశీ స్వప్నలకి దీప పెళ్లి చేస్తుంది. ఆ తర్వాత సుమిత్ర చూడకుండా.. శ్రీధర్, కావేరిలు లోపలికి వస్తుంటారు. దీప వాళ్ళని చూసి కాశీ, స్వప్నలని బయటకు పంపిస్తుంది. కావేరి, శ్రీధర్ లు వెళ్లేసరికి అక్కడ లేకపోవడంతో ఇంటికి వెళ్లి ఉంటారని శ్రీధర్ కావేరిని తీసుకొని ఇంటికి వెళ్తాడు. దీప దగ్గరికి సుమిత్ర వచ్చి.. నన్ను బయట ఉండమని చెప్పి నువ్వు లోపలికి వచ్చావ్ ఏంటని సుమిత్ర అంటుంది. అప్పుడే కాశీ ఫోన్ చేస్తాడు. నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్లున్నావ్ నేను కార్తీక్ జ్యోత్స్నల పెళ్లి ముహూర్తం అడుగుతాను. నువ్వు వెళ్ళమని సుమిత్ర అనగానే సరేనని దీప వెళ్తుంది.
మరొకవైపు కార్తీక్ ఆలోచిస్తుంటే అప్పుడే సుమిత్ర ఫోన్ చేసి.. తాతయ్య పెళ్లి ముహూర్తం పెట్టడానికి ఇంటికి అమ్మని తీసుకొని రమ్మని చెప్పాడు. వెళ్ళమని చెప్పగానే కార్తీక్ సరే అంటాడు. ఆ తర్వాత దీప వస్తుంది. మీరు ఒక జంటని దీవించండి అని చెప్పి.. స్వప్న, కాశీలని పిలుస్తుంది. వాళ్ళని చూసి నాతో ఒక్కమాట కూడా చెప్పలేదని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత కాశీతో కాంచన మాట్లాడుతుంది. ఇద్దరిని కాంచన ఆశీర్వదిస్తుంది. కార్తీక్ ఇంకా షాక్ లోనే ఉన్నాడు.. ఆశీర్వాదం తీసుకుంటారు.. ఇబ్బందిగానే కార్తీక్ ఆశీర్వదిస్తాడు. ఎక్కడ వాళ్ళ నాన్న వస్తాడోనని కార్తీక్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read